ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నియమితులైన మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని హైకోర్టుతో పాటు.. సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన మూటముల్లె సర్దుకుని చెన్నైకు వెళ్లిపోయారు. అయితే, ఆయన కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడ బెంజి సర్కిల్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని ఎంపిక చేసింది. ఈ ఇంటి యజమాని పేరు వల్లూరి రవీంద్రనాథ్.
ఇదిలావుంటే, కనగరాజ్ నియామకం చెల్లదంటూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసిన తర్వాత ఆయన న్యాయపోరాటం చేశారు. అయితే, దీనికి సంబంధించిన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించింది.
ప్రజాధనాన్ని ఇలా వృథా చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించింది. ఈ అంశంతో పాటు కనగరాజ్ ఇంటి కోసం రూ.20 లక్షలు, ఫర్నిచర్ కు రూ.15 లక్షల అంశాన్ని కూడా ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పరిశీలించాలని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.