ఎన్డీయేలో ఎలా చేరుతారు?: వైసీపీకి సీపీఐ సూటి ప్రశ్న
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (12:59 IST)
మంత్రి బొత్స వ్యాఖ్యలను సీపీఐ నేత రామకృష్ణ తప్పుబట్టారు. తాము ఎన్డీఏలో చేరవచ్చన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు ఆయన స్పందించారు.
సెక్యులర్ పార్టీ అంటూ అధికారంలోకి వచ్చి ఎన్డీఏలో ఎలా చేరుతారు? అని ప్రశ్నించారు. ప్రజావ్యతిరేక బిల్లులకు పార్లమెంట్‌లో వైసీపీ మద్దతిచ్చి ఓటేసిందని విమర్శించారు. ఇప్పుడేమో ఎన్డీయేలో చేరడానికి వైసీపీ ఉబలాట పడుతోందని విమర్శించారు.