అది నా రెండో ఇళ్లు.. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా వుంటాను.. ఆ కొటేషన్ నన్ను మార్చేసింది..

సెల్వి

మంగళవారం, 7 అక్టోబరు 2025 (12:14 IST)
Samantha Ruth Prabhu
ఈషా ఫౌండేషన్ తనకు రెండో ఇళ్లు లాంటిదని.. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా వుంటుందని అగ్ర హీరోయిన్ సమంత ప్రకటించింది. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుని తిరిగి పూర్తి ఉత్సాహంతో కనిపిస్తున్న సమంత, త్వరలోనే మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. 
 
ఇంకా సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా వుండే సమంత.. తాజాగా ఇన్‌స్టాలో తన ఫాలోవర్లతో సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు. ఓ అభిమాని మీ తదుపరి తెలుగు సినిమా ఏంటి? అని ప్రశ్నించగా, ఆమె మా ఇంటి బంగారం అని తెలిపారు. 
 
ఇదే సెషన్‌లో, మరో అభిమాని మీ జీవితాన్ని మార్చేసిన కొటేషన్ ఏది? అని అడగ్గా, సమంత ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. "మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి విషయం మనకు పాఠాలు నేర్పిస్తుంది. అలాంటి వాటి నుండి ఏదో ఒకటి నేర్చుకోవడం చాలా ముఖ్యం" అని తాను నమ్ముతానని సమంత వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు