అనంతపురంలోని మారుతినగర్‌కు చెందిన కోనేరు రామ చౌదరి, గుంతకల్‌కు చెందిన రంగనాయకులు హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు కుప్పం డిపో బస్సులో వస్తున్నారు. నిఘావర్గాల సమాచారంతో సీఐ లక్ష్మీదుర్గయ్య, సిబ్బంది బస్సును ఆపి తనిఖీ చేశారు.
దీంతో వీరిద్దరి బ్యాగుల్లో రూ 1.90 కోట్ల నగదు బయటపడింది. అప్పటి వరకు తమ పక్కనే ప్రయాణించిన వ్యక్తుల వద్ద కట్టల కొద్దీ డబ్బు చూసి తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అయితే ఈ నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేసి, స్థానిక కర్నూలు అర్బన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
రామచౌదరిని విచారించగా పొలం కొనుగోలు కోసం హైదరాబాద్ వెళ్లామని, బేరం కుదరకపోవడంతో డబ్బుతో స్వగ్రామానికి వెళుతున్నట్టు పోలీసులకు తెలిపారు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.