హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరుకు చెందిన శిరిష, హేమ లంగర్‌హౌస్‌లో ఓ హాస్టల్‌లో ఉంటూ జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. వీరి స్నేహితురాలు ఎల్లారెడ్డిగూడ హాస్టల్‌లో ఉంటోంది. కొద్దికాలం క్రితం ఆ యవతికి రాజ్‌కిరణ్ అనే ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరగడంతో రాజ్‌కిరణ్ ఆమెకు దగ్గరలోని ఓ హాస్టల్‌లో చేరాడు.
వీరికి సినీ అవకాశాలు రాకపోవడంతో ఆర్టిస్టుల కోసం వీరిద్దరు 'మన' పేరుతో ఓ సంస్థను స్థాపించారు. సభ్యత్వం పేరుతో కొంత డబ్బు వసూలు చేశారు. అయితే, లెక్కల విషయంలో వారిమధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీన్ని మనసులో పెట్టుకున్న రాజ్‌కిరణ్.. తన స్నేహితులైన శిరీష, హేమ, బాధిత యువతులను గత మార్చి 5వ తేదీన గుంటూరు తీసుకెళ్లి ఓ లాడ్జిలో బస కల్పించాడు. అపుడే శిరీష, హేమలు కలిసి ఆ యువతికి శీతలపానియంలో మత్తు కలిపి ఇచ్చారు.
దాన్ని సేవించిన బాధిత యువతి స్పృహకోల్పోగానే రాజ్‌కిరణ్‌తో పాటు మరో ముగ్గురు లైంగిక దాడిచేశారు. అయితే, అవకాశాలు తగ్గిపోతాయని ఆ యువతి నిమ్మకుండి పోయింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా రాజ్‌కిరణ్ తిరిగి వేధించసాగాడు. పైగా, తన వద్ద గ్యాంగ్‌రేప్‌కు సంబంధించిన వీడియోలు ఉన్నాయంటూ బెదిరించసాగాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.