కుటుంబకలహాలతో భార్య భర్తను చంపేసింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బస్తీలో కొంతకాలంగా భార్య దేవిక, భర్త జగన్ కలిసి నివసిస్తున్నారు. ఓ రాత్రి ఫూటుగా తాగొచ్చాడు జగన్. అంతే ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అదే ఆవేశంలో జగన్ నోట్లో హిట్ కొట్టేసింది దేవిక. దీంతో రసాయన ప్రభావంతో జగన్ ప్రాణాలు కోల్పోయాడు.
జగన్ రోజూ ఫుల్‌గా మద్యం సేవించి, దేవికను చిత్రహింసలకు గురిచేసేవాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో వేధింపులు తాళలేక భార్య దేవిక అతడిని హతమార్చింజని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం దేవికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.