మత్తుమందు అలవాటు చేసి.. అత్యాచారయత్నం.. బ్లేడుతో దాడి..

శనివారం, 9 మార్చి 2019 (19:06 IST)
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. ఓ అమ్మాయికి మత్తుమందులు అలవాటు చేసి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అమ్మాయికి కొందరు యువకులు మత్తు మందు అలవాటు చేశారు. ఆ విషయం తెలుసుకున్న మరో బ్యాచ్ ఆమెను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాలనుకున్నారు. 
 
అయితే ఈ వ్యవహారంపై ఇరు బ్యాచ్‌లకు మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇటీవల గంజాయి మత్తులో ఉన్న ఆమెను యువకులు వదిలి వెళ్లడంతో, ఆమెపై కన్నేసిన మరో బ్యాచ్ వచ్చి, వివస్త్రను చేసి అత్యాచారయత్నం చేసింది. 
 
ఈ క్రమంలో అమ్మాయిపై బ్లేడుతో దాడి కూడా జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగి ఈ దురాగతానికి పాల్పడిన యువకులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు