కామంతో కళ్లుమూసుకున్న కొందరు కామాంధులు వయసుతో పనిలేకుండా సభ్యసమాజం తలదించుకునే చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఓ వృద్ధుడు... ఏడేళ్ళ వయసున్న మనుమరాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదీ కూడా చాక్లెట్ ఆశ చూపి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
హైదరాబాద్, తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు కుటుంబ సభ్యులతో కలిసి నగరంలో నివాసముంటున్నాడు. వీరితో పాటు... ఏడేళ్ళ బాలిక కూడా నివాసముంటుంది. అయితే, ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనవరాలు (7)కు చాక్లెట్ ఇస్తానని గదిలోకి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశాడు.