నాకొద్దురా బాబు ఈ రాజకీయాలంటున్న వంశీ వల్లభనేని, ఎందుకని?

బుధవారం, 7 అక్టోబరు 2020 (13:50 IST)
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైరాగ్యంలో పడిపోయారు. వైసిపిలో అందరినీ కలుపుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్న వంశీని ఒక వర్గం వారు వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారట. ఇంత జరుగుతున్నా వైసిపి అధినాయకులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం వంశీని బాగా ఆవేదనకు గురిచేస్తోందట.
 
అంతేకాదు లేనిపోని నిందలు కూడా మోపుతున్నారని వల్లభనేని వంశీ కినుక వహిస్తున్నారట. అందుకే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలన్న ఆలోచనలో ఉన్నారట. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశమవడానికి సిద్ధమవుతున్నారట వల్లభనేని వంశీ.
 
తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉంటూ ఆ గుర్తుతో గెలిచారు వల్లభనేని వంశీ. అయితే ఆ పార్టీకి పూర్తిగా దూరమయ్యారు. ఇక మిగిలింది వైసిపినే. అయితే ఆ పార్టీకి ఎంత దగ్గరవుదామన్నా కానీ పార్టీ నేతలు మాత్రం వంశీని దూరంగా ఉంచారు.
 
ఈ మధ్య జరిగిన ఒక సమావేశంలో వల్లభనేని వంశీని వైసిపి నేతలే అడ్డుకోవడం.. అక్కడ కాస్త రచ్చ జరగడంపై పెద్ద చర్చే నడిచింది. వైసిపిలోని ఒక వర్గం వారే తనను వ్యతిరేకిస్తే అసలు తాను ఎందుకు రాజకీయాల్లో ఉండాలి. అసలు రాజకీయాలే వద్దని నిర్ణయించుకుని అదే విషయాన్ని తన అనుచరులకు చెప్పాలన్న నిర్ణయానికి వచ్చేశారట. కొన్నిరోజుల పాటు సైలెంట్‌గా ఉండాలన్నది వల్లభనేని ఆలోచన అట. మరి చూడాలి వంశీ నిర్ణయాన్ని అనుచరులు ఒప్పుకుంటారో.. వ్యతిరేకిస్తారో.? 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు