రాప్తాడు సిద్ధం సభ సూపర్ హిట్.. విజిల్స్, చప్పట్లతో...

సెల్వి

సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (22:07 IST)
Siddham
రాప్తాడు సిద్ధం సభ సూపర్ హిట్ అయ్యింది. రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు సుమారు పదిలక్షల మంది జనం వచ్చినట్లు వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. మరోవైపు ఎండను సైతం లెక్కచేయక తరలివచ్చిన కార్యకర్తలను చూసి ఏపీ సీఎం జగన్ సైతం.. కొత్త ఉత్సాహంతో కనిపించారు.
 
జగన్ ప్రసంగానికి కార్యకర్తలు కొట్టే విజిల్స్, చప్పట్లతో సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. రాప్తాడు సిద్ధం సభ సూపర్ హిట్ కావటంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాలుగో సభకు సిద్ధమవుతున్నారు. 
 
ఇదే సభలో కుర్చీ మడతపెట్టి మాటను మరోసారి ప్రత్యర్థులపై జగన్ ప్రయోగించారు. ఏపీ ప్రజలు చొక్కా మడతేసి, కుర్చీలు మడతపెట్టి.. చీపుర్లతో టీడీపీ పార్టీని ఊడ్చేయాలంటూ జగన్ పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు