జగన్ మోహన్ రెడ్డి 2000 కి.మీ పాదయాత్ర, తూర్పు నియోజకవర్గంలో యలమంచిలి రవి పాదయాత్ర

సోమవారం, 14 మే 2018 (20:10 IST)
రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకొని వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయటం కోసం పాదయాత్ర చేస్తున్న జగనన్నకు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని విజయవాడ తూర్పు నియజకవర్గ వైసిపి ఇంచార్జి యలమంచిలి రవి అన్నారు. కోట్ల ప్రజలకు అండగా అన్నగా రాష్ట్ర భవిష్యత్తుకు భరోసాగా అభివృద్ధికై తపన పడుతూ సాగుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 2000 కి.మీ చేరుకున్న సందర్భంగా జగన్ మోహన్ రెడ్డికి సంఘీభావంగా తూర్పునియోజకవర్గంలో యలమంచిలి రవి ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది.
 
సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన పాదయాత్ర 3,4,6,7వ డివిజన్లలో మధ్యాహ్నం వరకు సాగింది. ఈ సందర్భంగా జగనన్న పాదయాత్ర దిగ్విజయం కావాలని ఆకాంక్షిస్తూ యలమంచిలి రవి గుణదల మేరిమాత చర్చిలో పూజలు నిర్వర్తించారు. ఆ తరువాత బెంట్లీయం సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మాచవరం చేరుకుని ఆంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసి, అక్కడ నుండి మారుతినగర్ లోని మసీదుకు చేరుకొని ప్రార్థనలు చేశారు. ఆయా డివిజన్లలో జగన్‌కు మద్దతుగా యలమంచిలి చేపట్టిన పాదయాత్రకు విశేష ఆదరణ లభించింది.
 
కార్యక్రమములో 22వ డివిజన్ కార్పొటర్ పల్లెం రవి, 24వ డివిజన్ కార్పొటర్ చందన సురేష్,18వ డివిజన్ కార్పొరేటర్ పాల ఝాన్సీలక్ష్మి 16వ డివిజన్ కార్పొటర్ శివశంకర, రాష్ట్రనాయకులు, జిల్లా నాయకులు రవి అనుచరులు, వైఎస్సార్సీపి అభిమానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్దఎత్తున నియోకవర్గంలో నిర్వహించిన పాదయాత్రను విజయవంతం చేసినందుకు తూర్పు నియోజకవర్గ ప్రజలకు యలమంచిలి రవి ధన్యవాదాలు తెలియజేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు