దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తుంటే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎందుకు సరిగ్గా స్పందించడం లేదంటూ ప్రశ్నించారు సిపిఐ నారాయణ. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా లేకపోవడం.. వెంటిలేటర్ల కొరత అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కనిపిస్తోందన్నారు. ఎపిలోను కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని.. ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందన్నారు.
దేశంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు నారాయణ. అలాగే అవసరమైన ఆక్సిజన్ సదుపాయాన్ని, కరోనా రోగులకు బెడ్లను అందజేయాలన్నారు. కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమ సొంత డబ్బులను ఖర్చుపెట్టి హోం ఐసోలేషన్లో ఉన్న వారికి కడుపునిండా భోజనం పెడుతుందన్నారు.