భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని యువకుడి కుడిచేతిని నరికేసిన భర్త..
తన భార్యకు ఫోను ద్వారా పొద్దస్తమానం మెసేజ్‌లు పంపుతున్న ఓ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కట్టుకున్న భర్త.. చివరకు ఆ యువకుడి కుడిచేతిని నరికేశాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవద్దని, ఫోను సందేశాలు పంపొద్దంటూ పలుమార్లు హెచ్చరించినా ఆ యువకుడు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో విచక్షణ కోల్పోయిన భర్త.. ఆ యువకుడిపై కత్తితో దాడి చేసి చేతి వేలిని నరికేసాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.