ఈ బ్రహ్మోత్సవ సన్నాహాల్లో భాగంగా, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే సుధీర్ రెడ్డి హైదరాబాద్‌లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆహ్వానం అందించారు.
సుధీర్ రెడ్డి హైదరాబాద్‌లోని ఒక సినిమా సెట్‌లో చిరంజీవిని సందర్శించి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవానికి అధికారిక ఆహ్వానాన్ని అందజేశారు. గుడిమల్లం బ్రహ్మోత్సవానికి హాజరు కావాలని చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులను కూడా ఆయన ఆహ్వానించారు.