జనసైనికుడికి క్యాన్సర్: పరామర్శించిన జనసేనాని పవన్, రూ. 5 లక్షల సాయం
బుధవారం, 10 మార్చి 2021 (14:56 IST)
జనసేన అధ్యక్షలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. తన పార్టీ జనసైనికుడు క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడని తెలుసుకుని అతడి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లా లింగాల గ్రామంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న జనసేన అభిమాని భార్గవ్‌ను అతని స్వగృహంలో పరామర్శించారు.
అతడి వైద్యం కోసం రూ.5 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. క్యాన్సర్ పోరాడుతున్న జనసైనికుడికి ధైర్యం చెప్పారు. భార్గవ్‌కు ధైర్యాన్ని చెప్పి వెండి గణపతి విగ్రహాన్ని అందించారు.
JanaSena Chief Sri @PawanKalyan Meets His Fan Bhargava in Lingala