ఫిబ్రవరి మాస రాశిఫలాలు - మేష రాశివారి ఫలితాలు...

శనివారం, 1 ఫిబ్రవరి 2020 (08:46 IST)
మేషం: అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం
ఈ మాసం యోగప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఖర్చలు రాబడికి తగినట్టుగానే ఉంటాయి. విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. వాతావరణం మార్పుతో మీలో ఉత్సాహం నెలకొంటుంది. నూతన దంపంతుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. స్త్రీలు టివి ఛానెళ్ళ కార్యక్రమాల్లో రాణిస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడటంతో పాటు రాకపోకలు పునరావృతమవుతాయి. ఉద్యోగ విరమణ చేసిన వారికి రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. కొన్ని సందర్భాల్లో మీ కార్యక్రమాలు, ప్రయాణాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఉద్యోగ యత్నాలు ఆశాజనకంగా సాగుతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. ఒక శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారులకు అనుకూలం. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దైవ దర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
గ్రహాల అనుకూల సంచారం వల్ల కార్యసాధనలో జయం, సంఘంలో మంచి గుర్తింపు పొందుతారు. భాగస్వామిక, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. స్త్రీలు ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. వ్యాపారాల విస్తరణలు, లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. సంతకాలు, చెక్కులు జారీ విషయంలో ఏకాగ్రత వహించండి. ప్రయత్నపూర్వకంగా మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబీకులు, సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అధికం, ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. విద్యార్థులకు నూతన వాతావరణం, పరిచయాలతో మనస్సు కొంత అల్లకల్లోలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఉన్నతస్థాయి అధికారులకు ఆకస్మిక బదిలీలు తప్పవు. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లోపడే ఆస్కారం ఉంది. స్పెక్యులేషన్ రంగాల వారికి సామాన్యం.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ మాసం ప్రధమార్థం కొన్ని చికాకులు తలెత్తినా ద్వితీయార్థంలో మానసికంగా కుదుటపడతారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో ఆటుపోట్లు అధికమించటంతోపాటు కొంత అనుభవం గడిస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు సంబంధించిన విషయాల్లో లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీల ఆరోగ్యం కుదుటపడటంతో పాటు శారీరకంగా బలం పుంజుకుంటారు. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం లభిస్తుంది. మీ యత్నాలకు సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఏ విషయంలోనూ ఏకపక్ష నిర్ణయం మంచిది కాదని గమనించండి. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. మీ సంతాం విద్య, ఉద్యోగ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగస్తులు యూనియన్ కార్యక్రమాల్లో హడావుడిగా ఉంటారు. నిరుద్యోగుల ఆలోచోనలు ఉపాథి పథకాల దిశగా సాగుతాయి. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. వైద్య రంగాల వారు అరుదైన శస్త్రచికిత్సలను వుజయవంతంగా పూర్తి చేస్తారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యాపారాల విస్తరణల విషయం విరమించుకుని ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే దృష్టి సారించండి. విద్యార్థులకు అతి కష్టం మీద ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దంపతులకు ఏ విషయంలోనూ సఖ్యత అంతగా ఉండదు. కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి, తగు జాగ్రత్తలో ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారులను మెప్పిస్తారు. భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగిస్తాయి. ఆర్థికస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దుబారా ఖర్చులు నివారించాలన్న మీ యత్నం ఫలించదు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి, పనివారలతో చికాకులు తప్పవు. పుమ్యక్షేత్ర సందర్శనలు, దైవ కార్యాలు మీ మనస్సుకు ఉల్లాసం కలిగిస్తాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. పత్రిక, వార్తా సంస్థలలోని వారి శ్రమకు ఏమాత్రం గుర్తింపు ఉండదు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం శుభాశుభ మిశ్రమాలుగా ఉంటుంది. ఆదాయం బాగున్నా ఏదో తెలియని అసంతృప్తి మిమ్ములను వెన్నాడుతుంది. దుబారా ఖర్చులు నివారించాలన్న మీ యత్నం ఫలించకపోగా ఖర్చులు మరింత పెరుగుతాయి. ద్వితీయార్థంలో మానసికంగా కుదుటపడతారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. స్త్రీలకు ఆభరణాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆత్మీయులు అండగా నిలుస్తారు. ప్రతి పనికి ఒకటి రెండు సార్లు తిరగవలసి ఉంటుంది. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన మంచిది. మీ సంతానానికి దూర ప్రాంతాలలో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. సేవ, పుణ్య కార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. బ్యాంకు పనులు, ప్రయాణాల్లో మెలకువ వహించండి. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందులెదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, అదనపు బాధ్యతలు వంటి చికాకులు తప్పవు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి సామాన్యం.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
ఓర్పు, విజ్ఞతతో వ్యవహరించటం వల్ల కొన్ని సమస్యలు నిదానంగా సర్దుకుంటాయి. రుణయత్నాల్లో ఆటంకాలు తొలగి ధనం చేతికందుతుంది. ఉద్యోగస్తులు తోటివారి వల్ల అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి ఉంటుంది. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాథి పథకాల దిశగా సాగుతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. ఆస్తి పంపకాలకు సంబంధించి దాయాదులతో ఒక అవగాహనకు వస్తారు. భాగస్వామిక చర్చల్తో కొత్త అంశాలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, బంధువుల రాకపోకలు చికాకు పరుస్తాయి. ఏ యత్నం కలిసిరాకపోవటంతో మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది. కుటుంబీకులు మీ అవస్థలను అర్థం చేసుకోకపోగా మిమ్ములను వ్యతిరేకిస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. విద్యార్ధులకు నూతన పరిచయాలు ఉత్సాహం కలిగిస్తాయి. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం గ్రహాల అనుకూలత వల్ల అన్ని రంగాల వారికి శుభదాయకమే. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కీలకమైన వ్యవహారాల్లో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆంతరంగిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. మీ వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ఆర్థికస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. నూతన పెట్టుబడులు లాభిస్తాయి. ప్రైవేటు ఫైనాన్సు సంస్థల్లో పొదుపు చేయటం మంచిది కాదు. విద్యార్థుల టెక్నికల్, ఇంజనీరింగ్ కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. హోదాలో ఉన్న అధికారులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. కొంతమంది మిమ్ములను ఇరకాటానికి గురిచేస్తారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ఏమరపాటు వల్ల ముఖ్యమైన పత్రాలు, నగదు చేజార్చుకుంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. స్త్రీలకు బంధువులతో సత్సంబందాలు నెలకొంటాయి. వ్యాపారాల విస్తరణలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. గృహ నిర్మాణాల ప్లాను ఆమోదం పొందటంతో పాటు రుణం మంజూరవుతుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిరుత్సాహం చెందుతారు. ఆర్థక, కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞులను సంప్రదించటం మంచిది. ఖర్చులు అధికం, ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ ఆలోచన పలించదు. కొన్ని మొండి బకాయిలు అనుకోకుండా వసూలవుతాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరు కావటంతో నిలిచిపోయిన పనులు పునఃప్రారమభమవుతాయి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
 
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఈ మాసంలో కొన్ని ప్రతికూలతలెదురవుతాయి. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, పట్టింపులు అధికమవుతాయి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల వ్యవహారాల్లో పునరోలోచన మంచిది. మీ సంతానం ఉన్నత విద్యావకాశాల కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తారు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, అవకాశాలు కలిసి వస్తాయి. పోగొట్టుకున్న పత్రాలకు నకళ్ళు పొందుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు మందకొడిగా సాగుతాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు ఆశించినంత చురుకుగా సాగవు. ప్రతి విషయంలోను అనుమానం వ్యక్తం చేస్తారు. కొన్ని విషయాల్లో ఎదువారిని నమ్మించటానికి బాగా శ్రమించవలసి వస్తుంది. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు, చెక్కుల జారీ విషయంలో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులకు కొత్తగా వచ్చిన అధికారులతో సత్సంబందాలు నెలకొంటాయి. వృత్తిరీత్యా కొత్త వ్యక్తుల కలయిక, అకస్మిక ప్రయాణం వంటి పరిణామాలున్నాయి. నిరుద్యోగులు ఉపాథి పథకాల్లో నిలదొక్కుకుంటారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
స్థరచరాస్తుల క్రయ విక్రయాల వ్యవహారంలో సందిగ్ధానికి గురవుతారు. ఏ యత్నం చేపట్టినా సానుకూలమవుతుందా లేదా అన్న సంశయం కలుగుతుంది. సమయానికి ఆత్మీయులు అందుబాటులో లేకపోవటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. ఖర్చులు అధికమైనా ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల కోసం ఒకటికి పదిసార్లు తిరగవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు తప్పవు. నూతన దంపతుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. స్త్రీలకు ఆభరణాలు, అలంకరణల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఏజెంట్లు, బ్రోకర్లకు సామాన్యం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు ఆశించినంత సంతృప్తినీయవు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. భాగస్వామిక సమావేశాల్లో కొత్త అంశాలు చర్చకు వస్తాయి. వృత్తుల వారికి, చిరు వ్యాపారులకు ఆశాజనకం. వైద్య రంగాల వారు అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేస్తారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
రాబడికి మించిన ఖర్చులెదురైనా తట్టుకుంటారు. మీ సంతానానికి దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్ లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. ఆస్తి, భూమికి సంబంధించిన వివాదాలు ఒక కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి. కొన్ని ఊహించని సంఘటనలు మిమ్ములను ఇరకాటానికి గురి చేస్తాయి. లౌక్యగా వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. మీ లక్ష్యసాధనకు బాగా శ్రమించవలసి ఉంటుంది. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఇంజనీరింగ్ అధికారుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
వ్యాపారాల విస్తరణలు, లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టులు అనుకూలుస్తాయి. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. నికుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. స్త్రీలకు బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ట్రాన్సుపోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. మీ మాటకు ఇంటా బయటా మంచి స్పందన లభిస్తుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. మిమ్ములను తక్కువగా అంచనా వేసిన వారే మీ సమర్థతను గుర్తిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్ కార్యకలాపాల్లో చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. దూర ప్రయాణాలు, బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యవహారాలు ఎంతకీ తేలకపోవటంతో నిరుత్సాహం చెందుతారు. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి అంచనాలు ఫలిస్తాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు