యోగ ముద్రల ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. చేతి వేళ్ళ ద్వారా వేసే ముద్రల ద్వారా ఆరోగ్య పరమైన ప్రయోజనాలున్నాయని యోగా గురువులు చెప్తున్నారు. యోగ ముద్రల ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఒత్తిడిని ఇవి దూరం చేస్తాయి. కొన్ని ముద్రలను రోజూ పాటిస్తే కనుక ఒత్తిడి ఎలా అధిగమించగలమనే నిజాలను తెలుసుకోవచ్చు.
ఈ మూడు వేళ్లను ముద్రలో భాగం చేయడం ద్వారా ఆలోచనా శక్తి పెంపొందుతుంది. అలాగే అంగారకుడు, బుధుడు, శని గ్రహాలను కలిసి వుంచినట్లవుతుంది. ఫలితంగా సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ ముద్ర ద్వారా శాశ్వత బలం కలుగుతుంది. జీవక్రియను పెంచుతుంది. అంగారకుడు, బుధుడు, శనిగ్రహాలు ఒక పాయింట్‌కు చేరడం ద్వారా మూడు గ్రహాల ప్రభావంతో పాజిటివ్ ఫలితాలుంటాయి.
ముందుగా పద్మాసనంపై కూర్చోవాలి. కూర్చునేందుకు మ్యాట్‌ను ఉపయోగించవచ్చు. సూర్యోదయం సమయంలో ఈ ముద్రను వేసినా మంచి ఫలితం వుంటుంది. తర్వాత కళ్లను మూసి.. ధ్యానంలోకి వెళ్లాలి. ముందుగా చూపుడు, మధ్య వేళ్లను బొటన వేలిపై ఆనించి.. ఉంగరపు వేలును, చిటికెడు వేలును అరచేతిలోకి తీసుకోవాలి. ఇలా చేస్తే సంపదలకు ఢోకా వుండదు.
ఈ ముద్రను ఉదయం, సాయంత్రం పూట ఏ సమయంలోనైనా పాటించవచ్చు. రోజుకు ఎన్నిసార్లైనా కుబేర ముద్రను పాటించవచ్చు. రోజుకు ఐదు- పదిసార్లు వేస్తే మంచి ఫలితాలుంటాయి. బొటనవేలు అగ్నిని, చూపుడు, మధ్య వేలు గాలి, భూమిని సూచిస్తాయి. ఈ మూడు శక్తులు కలిసి వున్నప్పుడు మీరు కోరుకునే కోరికలు, ఆకాంక్షలన్నీ నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.