టీటీడీలో అక్రమాలు జరుగుతుంటే.. గాడిదలు కాస్తున్నావా?: జేసీ దివాకర్ రెడ్డి

శనివారం, 9 జూన్ 2018 (10:43 IST)
తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోటు వద్ద నేళమాళిగలో తవ్వకాలు జరిగాయన్నారు. విలువైన ఆభరణాలు పోయాయని కూడా ఆరోపించారు. పింక్ డైమండ్ కనిపించడం లేదని సంచలన ప్రకటన చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి నగలపై ఆరోపణలు చేస్తున్న మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులుపై టీడీపీ ఎంపీ జీసీ దివాకరరెడ్డి మండిపడ్డారు. 
 
ప్రధాన అర్చకుడిగా ఉన్న సమయంలో రమణ దీక్షితులు ఆరోపణలు చేసి ఉంటే ప్రజలు వినేవారని, నమ్మేవారని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఏదో జరిగిందని తెలిసిన వెంటనే చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా.. ఇన్నాళ్లు ఏం చేస్తున్నావ్..? నిద్రపోయావా? గాడిదలు కాస్తున్నావా? అని ప్రశ్నించారు. 
 
దేవుడి సేవలో ఎన్నో ఏళ్ల పాటు ఉన్న నీవు అప్పుడు ఈ విషయం చెప్పలేదంటే... నీవు దొంగ స్వామి అయినా అయి ఉండాలి లేదా ఇందులో భాగస్వామివైనా అయి ఉండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ఒక బజారు వ్యవహారమన్నారు.
 
టీటీడీలో మంత్రాలు ఉచ్చరించిన మనిషి లోటస్ పాండ్‌లో మంతనాలు జరుపుతూ కెమెరాకు చిక్కారు. వివాదాస్పద టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వెళ్లారు. జగన్‌తో అరగంట పాటు మంతనాలు జరిపారు. ఇటీవల టీటీడీలో అర్చకుల రిటైర్మెంట్ వయస్సుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో రమణ దీక్షితులు ఉద్యోగం ఊడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు