ఆంధ్రా ఎంపీని అవమానించిన కాంగ్రెస్.. సభలో దొరకని మద్దతు

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (12:32 IST)
కాంగ్రెస్ పార్టీ మళ్లీ మోసం చేసింది. రాజ్యసభ వేదికగా పోరాటం చేస్తున్న ఆ పార్టీకి చెందిన ఆంధ్రా ఎంపీ డాక్టర్ కేవీపీ రామచంద్రరావుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు కదా సభా ముఖంగా ఆయన్ను అవమానపరిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం రాజ్యసభ వేదికగా కేవీపీ రామచంద్రరావు చేస్తున్న నిరసన కార్యక్రమాలను తమ పార్టీ ఏమాత్రం సమర్థించబోదని రాజ్యసభలో కాంగ్రెస్ విపక్ష నేత గులాం నబీఆ ఆజాద్ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకి తేల్చి చెప్పారు. 
 
దీంతో కేవీపీ తక్షణం తన సీట్లో కూర్చోని పక్షంలో 256 నిబంధన కింద చర్య తీసుకుంటానని రాజ్యసభ ఛైర్మన్ హెచ్చరించారు. అప్పటికీ ఆయన సభలో నిరసనను విరమించలేదు. దీంతో ఆయనపై ఛైర్మన్ ఒక రోజు పాటు సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో అటు సొంత పార్టీ, ఇటీ టీడీపీ సభ్యుల మద్దతు లేకపోవడంతో ఒంటరిగా మారిపోయాడు. ఫలితంగా ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తూ ఆయన సభ నుంచి వీడిపోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు