ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కాదంబరీ జెత్వానీ, ఆమె తల్లిదండ్రుల పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో ఆమె ఫోన్లను తెరిపించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. జెత్వానీ ఐఫోన్లను తెరిపించేందుకు ఆమె సన్నిహితుడిపై మరో తప్పుడు కేసు పెట్టినట్లుగా తెలిసింది.
బెజవాడలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న ఒక స్పా కేంద్రంలో సోదాలు చేశారు. అక్కడ వ్యభిచారం జరుగుతోందంటూ మణిపూర్‌కు చెందిన కొందరు యువతులపై కేసు నమోదు చేశారు. అందులో స్పా సెంటర్ నిర్వాహకురాలు తమాంగ్ (మణిపూర్‌కి చెందిన యువతి)ను ఏ 1గా చేర్చారు. విటుడిగా పేర్కొంటూ ఏ 2గా అమిత్ సింగ్‌ను ఇరికించారు. అతను ఢిల్లీ నుంచి ఇక్కడకు మహిళలను సరఫరా చేస్తున్నారని అభియోగాలు నమోదు చేశారు.