ఈ పనుల్లో భాగంగా ప్రకాశం బ్యారేజీకి దిగువన 12 కిలోమీటర్ల వద్ద ఒక బ్యారేజీ, 62 కిలోమీటర్ల వద్ద ఒక బ్యారేజీ, ఉప్పుటేరుపై ఒక బ్రిడ్జ్ కమ్ లాకు, ఉప్పుటేరుపై మరో బ్రిడ్జి కమ్ లాకు, 1.40 కిలోమీటరు వద్ద రెగ్యులేటర్, పెదలంక మేజర్‌పై అవుట్ ఫాల్ స్లూయిస్‌లను నిర్మిస్తామని జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పనులను విజయవాడ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ, హైడ్రాలజీ సీఈ, ప్రభుత్వ సలహాదారు ఎం.గిరిధర్‌రెడ్డి, గోదావరి డెల్టా సిస్టమ్స్ సీఈ పర్యవేక్షిస్తారు.