ఎవరి విశ్లేషణకూ అర్థంకాని రీతిలో జగన్ వ్యవహారశైలి ఉందని, రాష్ట్రం జగన్ జాగీరు కాదని అన్నారు. బ్రిటీష్ వారైనా చట్టాన్ని అనుసరించేవారని, జగన్ కనీసం చట్టాన్ని కూడా గౌరవించడం లేదని విమర్శించారు. పేదలకు అన్నం పెట్టే అన్నక్యాంటీన్లను మూసేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఇసుక కొరతతో లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయాలను 2003లోనే ప్రారంభించామని, ఇప్పుడేదో కొత్తగా తీసుకొచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 11 అవినీతి కేసులున్న వ్యక్తి నీతిమంతుడిలా చెలామణి అవుతున్నారని అన్నారు.