కాగా, గత మార్చి నెలలో ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. అనేక ప్రాంతాల్లో ఏకగ్రీవంగా అనేక మంది ఎన్నికయ్యారు కూడా. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఈ ఎన్నికలను వాయిదా వాయిదా వేశారు. ఆ తర్వాత ఈ ఎన్నికల కోసం జారీచేసిన నోటిఫికేషన్ కూడా రద్దు అయింది.
ఈ క్రమంలో వచ్చే యేడాది ఫిబ్రవరిలో పంచాయతీ పోల్స్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, అందువల్ల ఈ ఎన్నికల నిర్వహణ నిర్ణయంపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టులో ఏపీ సర్కారు నోటిఫికేషన్ జారీచేసింది.