వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పిట్టలగూడకు చెందిన మధు(22), ఓ యువతి (16) ప్రేమికులు. కొన్నిరోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అపహరణ కేసు కింద మధును రిమాండుకు తరలించారు.
మధు రిమాండ్‌కు వెళ్లగానే.. అదే గ్రామానికి చెందిన మల్లేష్ (వరుసకు బావ)తో యువతికి పెళ్లిచేసి, పిట్టలగూడలోనే కాపురం పెట్టారు. శనివారం రాత్రి ఇంట్లో భోజనంచేసి నిద్రించిన యువతి... ఆదివారం తెల్లారేసరికి కనిపించలేదు. దీంతో మధుపై అనుమానం వ్యక్తంచేస్తూ యువతి కుటుంబ సభ్యులు నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు.