మార్చి 9 నుంచి మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

గురువారం, 18 ఫిబ్రవరి 2021 (09:51 IST)
దక్షిణ భారత దేశంలో పేరెన్నికగన్న మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి అధ్యక్షతన సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కామేశ్వరీ సహిత మహానందీశ్వర స్వామివార్లకు మార్చి 9 నుంచి 14వ తేదీ వరకూ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.

ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులకు సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి పలు సూచనలు చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు సమన్వయంతో పని చేయాలని ఆమె ఆదేశించారు. మార్చి 9వ తేదీన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురారోపణ చేస్తారు. 10వ తేదీన విశేష హోమాలు, వాహన సేవలు నిర్వహిస్తారు.

11వ తేదీన రాత్రి 10 గంటల నుంచి లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం, తెల్లవారు జామున 3 గంటలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. 12వ తేదీ ఉదయం నిత్య పూజలు, దీక్షా హోమాలు, 13న యాగశాల పూజలు, రథోత్సవం నిర్వహిస్తారు. 14వ తేదీన పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు