ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఆక్రమణలను క్రమబద్దీకరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర్ర రెవిన్యూ,రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
విజయవాడ నగరంలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆక్రమణను ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మానవతా ధృక్పథంతో క్రమబద్దీకరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
విజయవాడ నగరంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలోని కరకట్ట, బుడమేరు, ఏలూరు కాల్వ, ఇందిరానగర్, కాకానినగర్ దేవినేని గాంధిపురం చెరువు, వెంకటేశ్వర నగర్, గాంధీజీనగర్, గుణదల, మోగల్రాజపురం, పటమట, చుట్టిగుంట ప్రాంతాల్లో ఇరిగేషన్,ఆర్ అండ్ బీ, మరియు ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలో ఉన్న ఇళ్ళను రైగ్యులరైజ్డ్ కు ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బీ, రెవిన్యూ అధికారులు పరిష్కరించే విధంగా పనిచేయాలన్నారు.
పేద ప్రజలకు సహాకారం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారని అందుకు నిదర్శనమే ఇటీవలి జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచారన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారయత్రాంగం కష్టపడి పనిచేయడం వలన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని ముఖ్యమంత్రి ఎప్పుడూ నమ్మతుంటారన్నారు.
జిల్లా కలెక్టరు ఏఎండి ఇంతియాజ్ మంత్రికి వివరిస్తూ విజయవాడ నగరంలో ఆక్రమణలో 15,419 కుటంబాలకు నివశిస్తుండగా ఇందులో 12,500 కుటుంబాలకు గృహాలను మంజూరు చేసి వేరే చోట ఇవ్వడం జరిగిందన్నారు.
నదీపరీవాహక ప్రాంతాల్లో ఉన్నఆక్రమణలను క్రమబద్దీకరణ చేయవద్దంటూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలున్నాయన్నారు. కోర్టు పరిధిలోలేని పెండింగ్ అంశాలను త్వరత గతిన పరిష్కరిస్తామని కలెక్టరు అన్నారు. పెండింగ్ అంశాలకు సంబందించి ఇప్పటికే ఆర్కియాలజి, రైల్వే శాఖలతో చర్చించడం జరిగిందన్నారు. ఆక్రమణలో ఉన్న అన్ని గృహాలను సంబందిత తాశీల్థార్లు గుర్తించి నమోదు చేసారన్నారు.