ఆధార్ కార్డుల్లో తప్పులా.. మీరే సరిచేసుకోండి

ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (15:11 IST)
ఇప్పుడు మీరే మీ ఆధార్ కార్డు మార్పులు చేయవచ్చు. మీరు ఇంతకుమందు ఇచ్చిన సమాచారంలో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే మీరు ఆధార్ సెంటర్లకు తిరగనవసరం లేదు. కేవలం మీ దగ్గర ఇంటర్నెట్ ఉంటే చాలు. నెట్ సదుపాయం ఉంటే మనమే ఆధార్ వెబ్‌‌సైట్‌లోకి వెళ్ళి మన వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
http://ssup.uidai.gov.in/web/guest/update వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద నల్లటి అక్షరాల్లో కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్‌ను టైప్ చేయాలి. అక్కడ మీకు సెండ్ ఓటిపీ బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన మొబైట్ నెంబర్‌కు ఓటిపి వస్తుంది. ఆ వన్ టైమ్ పాస్ వర్డ్‌ను ఎంటర్ చేస్తే తర్వాత పేజీకి వెళుతుంది.
 
ఇక్కడ పేరు లేదా చిరునామా, మొబైల్ నంబర్, ఈ మెయిల్ వీటిలో మార్చాల్సిన వాటిని సెలక్ట్ చేసుకుని వివరాలు ఇంగ్లీష్ లేదా ప్రాంతీయ భాషలో నమోదు చేయాలి. మార్చిన వివరాలకు ఆధారంగా ఏదేని డాక్యుమెంట్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది. చిరునామాలో మార్పు అయితే కొత్త చిరునామాను తెలియజేసే డాక్యుమెంట్ జిరాక్స్ కాపీ పై సెల్ప్‌ అటెస్టేషన్‌తో స్కాన్ చేసి దాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరగా యుటిఆర్ నంబర్ రాసి పెట్టుకుంటే తర్వాత విచారణకు ఉపకరిస్తుంది.
 
కొత్త వివరాలు ఆధార్‌లో చోటుచేసుకున్నాయా.. లేదా అనే దానిని పరిశీలించేందుకు https://ssup.udai.gov.in/web/guest/check-status యూఆర్ఎల్ నంబర్లను నమోదు చేసి గెట్ స్టేటస్ బటన్ క్లిక్ చేసే స్టేటస్ వస్తుంది. వెయిటింగ్ అఫ్రూవల్ లేక అఫ్రూవల్ ముగిస్తే నూతన ఆధార్ కార్డును ఈ కార్డు రూపంతో పొందవచ్చు.
 
ఇందుకోసం http://eaadhaar.uidai.gov.in/ సైట్ ఓపెన్ చేయాలి. ఎన్‌రోల్‌మెంట్ నంబర్ లేదా ఆధార్ నెంబర్ ఏది ఉంటే దానిపైన సెలక్ట్ చేసుకుని ఆ నెంబర్‌ను కిందనున్న కాలమ్‌లో ఎంటర్ చేయాలి. పూర్తి పేరు పిన్ కోడ్, తర్వాత కాలమ్ కింద కనిపించే అక్షరాలు. మొబైట్ నెంబర్ నమోదు చేయాలి. గెట్ వన్‌టైమ్ పాస్ వర్డ్ క్లిక్ చేస్తే మొబైల్‌కు పాస్‌వర్డ్ వస్తుంది. దాన్ని ఎంటర్ క్లిక్ చేయగానే పీడిఎఫ్‌ రూపంలో ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది. ఆధార్ కార్డు తీసుకునే సమయానికి ఇచ్చిన మొబైట్ నెంబర్ ప్రస్తుతం వాడుకలో లేకుంటే ఆన్ లైన్ లో ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే అప్‌డేట్ చేసుకునే ముందు రిజిస్ట్రర్ మొబైట్ నెంబర్‌కు ఓటిపి వస్తుంది. దాని ద్వారానే ముందుకు వెళ్ళడం సాధ్యం అవుతుంది. 

వెబ్దునియా పై చదవండి