చిత్తూరు జిల్లాలో మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ మరియు రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత వీల్ చైర్స్, పరికరాలను ఎమ్మెల్యే రోజా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... "బ్యాంకు బ్యాలెన్సులు, భూములు కొనుగోలు చేసుకోవడంతో మన జన్మ సార్థకం కాదు. ఎన్నేళ్లు బ్రతికామని కాదు.. ఎలా బతికామని వైఎస్సార్ చెప్పేవారు. అదే జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు.
అందుకే మేము కూడా అదే ఫాలో అవుతున్నాం. రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను కూడా సహాయం చేస్తున్నాను. దేవుడు కొందరికి కొన్ని అవయవాలను లోటు చేసినప్పటికీ సహాయం చేసే చేతులు వున్నప్పుడు అలాంటి అంగవికలురికి ఆసరా దొరుకుతుందని అన్నారు. ప్రభుత్వాలు కూడా వికలాంగుల పోస్టులను భర్తీ చేయాలి. వాళ్లకి ఇవ్వాల్సిన రుణాలను పార్టీలకు అతీతంగా ఇవ్వాలని కోరుతున్నాను'' అని చెప్పారు. వీడియో చూడండి.