టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ త్వరలో ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రాష్ట్రంలో ఇపుడు ఎన్నికలు లేవు కదా? ఆయనెక్కడ పోటీ చేస్తారనే కదా మీ సందేహం... అయితే, ఈ కథనం చదవండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో 22 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరిగే అవకాశం ఉంది. ఇందులో ఎమ్మెల్యేల కోటా నుంచి ఏడు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుతం శాసనసభలో ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి పాలక టీడీపీకి ఆరు, వైసీపీకి ఒకటి ఎమ్మెల్సీ సీట్లు లభించే అవకాశం ఉంది.
దీనికి కారణం లేకపోలేదు... తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే.. ఆయన తనయుడు కేటీఆర్ ప్రత్యక్ష ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కేటీఆర్‌కు కేసీఆర్ తన మంత్రివర్గంలో కీలక శాఖలను కట్టబెట్టారు. వీటిలో ఐటీ శాఖ కూడా ఉంది. అలాగే, నారా లోకేష్‌కు కూడా ఐటీ శాఖను ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనగా ఉంది.