త్వ‌ర‌లో తెరుచుకోనున్న సినిమా థియేట‌ర్లు

గురువారం, 20 ఆగస్టు 2020 (09:18 IST)
దేశవ్యాప్తంగా అన్‌లాక్ 4.0లో భాగంగా త్వ‌ర‌లో సినిమా థియేట‌ర్లు తెరుచుకోనున్నాయని సమాచారం. ఇప్ప‌టికే ద‌శలో భాగంగా రెస్టారెంట్లు, మాల్స్, జిమ్, యోగా కేంద్రాల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చిన సంగ‌తి తెలిసిందే.

లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి సినిమా హాళ్లు మూత‌పడ‌టంతో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు భారీ న‌ష్టం వాటిల్లింది. ఆగ‌స్టు చివ‌రినాటికి అన్‌లాక్ 3.0 ముగియ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం సినిమా థియేట‌ర్లకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌నుంద‌ని విశ్వసనీయ స‌మాచారం.

సామాజిక దూరం, శానిటైజేష‌న్ వంటి నిబంధ‌న‌లు పాటిస్తూ సినిమా హాళ్లు తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించే అవ‌కాశం ఉంది. సీట్ల మ‌ధ్య దూరం, సిటింగ్ సామ‌ర్థ్యం వంటి వాటిపై ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేయ‌నుంది.
 
క‌రోనా వ్యాప్తి దృష్ట్యా టెంప‌రేష‌ర్ కెపాసిటీ కూడా 24 డిగ్రీలు ఉండేలా దిశానిర్దేశం చేయ‌నుంది. ఇప్ప‌టికే 3డీ సినిమాల‌కు స్పెషల్ క‌ళ్ల‌జోడు ఉప‌యోగిస్తుండ‌గా, ప్రస్తుతం సినిమా చూస్తున్నంత‌సేపూ ప్రేక్ష‌కులు మాస్క్ ధ‌రించాల‌న్న నిబంధ‌న కూడా ఉండ‌నుంది.

ప్రతి స్క్రీనింగ్ తర్వాత సినిమా హాల్ ప్రాంగణాన్ని పూర్తిగా శానిటైజ్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి చేసేలా థియేట‌ర్ నిర్వాహ‌కులు చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

ఇప్ప‌టికే అన్‌లాక్‌లో భాగంగా జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చినందున సినిమా హాళ్లు కూడా తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుతివ్వాల‌ని ప‌లు థియేట‌ర్ యాజ‌మాన్యాలు ప్ర‌భుత్వానికి విజ్ఞప్తి చేశాయి.

కాంటాక్ట్‌లెస్ టికెటింగ్, రెగ్యులర్ శానిటైజేషన్‌తో సినిమా హాళ్లు తిరిగి తెరవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి గైడ్‌లైన్స్‌ని విడుద‌లయ్యే అవకాశాలున్నాయని ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారి ఒకరు వెల్ల‌డించారు. అయితే మ‌ల్టీప్లెక్స్‌ల‌లో సినిమా హాళ్ల‌పై ఆంక్ష‌లు కొన‌సాగుతాయా లేదా అన్న‌దానిపై సందేహం నెల‌కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు