నవ్యాంధ్రలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనదేనని వైకాపాకు చెందిన నరసాపురం రఘురామకృష్ణంరాజు అన్నారు. శనివారం వెస్ట్ గోదావరి జిల్లాలో మాట్లాడుతూ, రాజధాని తరలింపు నిర్ణయం మంచిదేనని చెప్పారు. జనవరి 20వ తేదీన అసెంబ్లీలో చర్చించిన తర్వాతే రాజధానులపై ఓ ప్రకటన వెలువడుతందని ఆయన చెప్పారు.
అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ రెండు అంశాలన్నారు. వీటిపై ప్రతిపక్షాలు చేస్తున్న 'అధికార వికేంద్రీకరణ వద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి' అన్న వాదన నూటికి నూరుపాళ్లు సమంజసమైనదన్నారు. అయితే సీఎం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొన్నారని వివరించారు.