వైజాగ్ ఆల్రెడీ రాజధాని అమ్మ మొగుడు లాంటి సిటీ.. నాగబాబు

శనివారం, 15 అక్టోబరు 2022 (22:13 IST)
విశాఖ రాజధానిపై జనసేన నేత, నటుడు కొణిదెల నాగబాబు ట్వీట్ చేశారు. వైజాగ్‌ను మీరు రాజధాని చెయ్యటం ఏంట్రా బాబూ.. వైజాగ్ ఆల్రెడీ రాజధాని అమ్మ మొగుడు లాంటి సిటీ అని ట్వీట్ చేశారు. వీలైతే ఇండియాకి రెండో రాజధాని చెయ్యమని గర్జించండి అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.

అంతేకాకుండా 'వైసీపీ ఇంజ్యూరియ‌స్ టూ ఏపీ ఎన్‌వైరాన్‌మెంట్‌', 'సేవ్ వైజాగ్ ఫ్రం ఎన్‌వైరాన్‌మెంట్ డెస్ట్రాయ‌ర్స్' అనే హ్యాష్ ట్యాగుల‌ను కూడా ఆయ‌న త‌న ట్వీట్‌కు జ‌త చేశారు.

కాగా... అధికార వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తుగా శ‌నివారం విశాఖ‌లో అధికార వైసీపీ విశాఖ గ‌ర్జ‌న పేరిట ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం, ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చి వెళుతున్న వైసీపీ కీల‌క నేత‌ల‌పై జ‌న‌సేన శ్రేణులు దాడికి పాల్ప‌డ్డారు. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు