తితిదే చరిత్రలో శ్రీవారి ఆదాయంలో సరికొత్త రికార్డు

మంగళవారం, 5 జులై 2022 (09:13 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి భక్తులు కానుకల రూపంలో సమర్పించే ఆదాయంలో సరికొత్త రికార్డు నమోదైంది. సోమవారం రికార్డు స్థాయిలో 6 కోట్ల 18 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. గత 2018 జూలై 26వ తేదీన రూ.6.28 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. సోమవారం ఏకంగా రూ.6.18 కోట్ల ఆదాయం రావడంతో తితిదే అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 
గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చింది. ఈ యేడాది ఆరంభం నుంచి కరోనా వైరస్ వ్యాప్తి శాంతించడంతో పాటు కరోనా నిబంధనల్లో సడలింపులు ఇచ్చారు. దీంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో సోమవారం రికార్డు స్థాయిలో శ్రీవారికి రూ.6.18 కోట్ల ఆదాయం వచ్చింది. తితిదే చరిత్రలోనే ఈ తరహాలో ఆదాయం రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు