టిటిడిలో 140 పాజిటివ్ కేసులు కాదు ఇంకా ఎక్కువే.. ఎంతంటే?

శనివారం, 18 జులై 2020 (14:36 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగస్తులకు కరోనా సోకినట్లు అధికారికంగా పాలకమండలి ఛైర్మన్ నిర్థారించారు. వై.వి.సుబ్బారెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మొత్తం 140 మందికి కరోనా సోకినట్లు చెప్పారాయన. అయితే అధికారికంగా మరికొన్ని వివరాలు వెలువడించారు అధికారులు.
 
అందులో మొత్తం 158 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఉంది. టిటిడిలోని వివిధ విభాగాల్లో పనిచేసే వారి వివరాలు.. అత్యధికంగా ఎపిఎస్పీఎఫ్‌ సిబ్బందిలో 43 మందికి, పోటు కార్మికుల్లో 27మందికి, అర్చకులు, దీక్షితులు, వాహన బోయలు మరో 21 మంది ఉన్నారు. ఈ మొత్తం కలిపితే 158 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారికంగా లెక్కలు ప్రకటించారు.
 
ఇప్పటికే పెద్దజియ్యర్‌కు కరోనా సోకడం.. అర్చకులు, మిగిలిన వారికి కరోనా సోకుతున్న పరిస్థితుల్లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో భక్తులు, స్థానికుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు