తప్పుడు కేసులతో టిడిపి అధినేత చంద్రబాబును భయపెట్టాలనుకుంటున్నారని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సిఐడి నోటీసులు ఇచ్చారని ఆపార్టీ సీనయర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఎపి సిఐడి అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
దీనిపై టిడిపి నేతలు స్పందించారు. చంద్రబాబును రెండేళ్లలో ఏమీ చేయలేని జగన్ సర్కార్.. ఇప్పుడు ఏం చేస్తుందని ప్రశ్నించారు. రెండ్రోజుల నుంచి సిఎం జగన్ క్యాంప్ భయపడుతోందన్నారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంలో జగన్ ఉన్నారని విమర్శించారు. ఎ1, ఎ2 బెయిల్ రద్దయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎపి సిఎంపై ఉన్న కేసులు దేశంలో ఏ ముఖ్యమంత్రులపైనా లేవని వర్ల రామయ్య పేర్కొన్నారు.