ఉల్లి కొరతపై విజిలెన్స్ నిఘా తీవ్రతరం

సోమవారం, 30 సెప్టెంబరు 2019 (11:51 IST)
రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి కొరత ఉన్నందున విజిలెన్స్ అధికారులు నిఘా పెంచారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న ఉల్లి కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. 34 కేంద్రాల్లో నిబంధనలు పాటించలేదని గుర్తించారు. వీరిలో 28 మంది ప్రభుత్వ అనుమతులు లేకుండా విక్రయాలు నిర్వహిస్తున్నారని విజిలెన్స్​ డీజి రాజేంద్రనాథ్​ రెడ్డి వెల్లడించారు. 
 
అక్రమంగా నిల్వ ఉంచిన 3,398 క్వింటాళ్ల ఉల్లిపాయలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటి 65 లక్షల రూపాయల ఉండవచ్చని అంచనా వేశారు. స్వాధీనం చేసుకున్న ఉల్లిపాయలను మార్కెటింగ్ శాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 61 లక్షా 95 వేల రూపాయల విలువ చేసే ఉల్లిపాయలను స్వాధీనం చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు