కాగా, ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ప్రియాంక చోప్రాను ఓ పాకిస్థాన్ మహిళ..'భారత బలగాలు పాక్ పై వైమానిక దాడులు చేసినప్పుడు మీరు జైహింద్ అని ట్వీట్ చేశారు. యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్‌గా ఉంటూ ఇలా ప్రవర్తించడం ఏంటి?' అని నిలదీసింది.'
దీనిపై ప్రియాంకా స్పందిస్తూ, పాకిస్థాన్‌లో తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. పైగా, నేను భారతీయురాలిని. నా దేశం పట్ల నాకు గౌరవం ఉంది. నేను రెచ్చగొట్టేలా మాట్లాడలేదు. నువ్వు నీ దేశం కోసం ఎలా ప్రశ్నిస్తావో., నేనూ నా దేశం తరపున అలాగే మాట్లాడతా. ఇలా అందరిలో అరిచి నీ పరువు పోగొట్టుకోకు అని ఘాటుగానే సమాధానమిచ్చింది.