ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉభయగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నేతలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసివుండివుంటే పార్టీ బలం ఇపుడు మరింతగా పెరిగివుండేదన్నారు. అయితే, జనసేన కోసం మహిళలు, యువతీయువకులు స్వచ్ఛంధంగా పని చేశారనీ, అందువల్ల లక్షల ఓట్లు వచ్చాయని చెప్పారు.
మరోవైపు, ఈ ఎన్నికల్లో సక్రమ పద్ధతిలో జరగలేదన్నారు. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు కోట్లాది రూపాయలను వెచ్చించారన్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఈ ఖర్చు రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేశారని గుర్తుచేశారు. కానీ, జనసేన మాత్రం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు.
ఓటర్లకు డబ్బు ఎరవేయకుండా స్వచ్ఛమైన రాజకీయాలు చేసినట్టు పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో అన్నారు. ఈ ఎన్నికల ఫలితలతో డీలా పడిపోకుండా ప్రజల కోసం మరింత బలంగా ముందుకు సాగాలని, ఇబ్బందుల్లో ఉన్నవారికి మేమున్నాం అంటూ జనసైనికులు భరోసా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.