కాగా, వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నెలకొనేలా కృషి చేయాలని... అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని, దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ఏకధాటిగా వానలు పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. వరద బాధితులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా ఉండి ధైర్యం చెబుతున్నారు.