పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై జనసైనికుల దాడి - వర్మ మాటలు - వీడియో (video)

సెల్వి

శుక్రవారం, 7 జూన్ 2024 (23:07 IST)
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. పిఠాపురం సీటు నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 
 
ఈ విజయం వెనక ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా కృషి చేశారు. గతంలో ఈ టికెట్ త్యాగం చేసేందుకు వర్మను చంద్రబాబు ఒప్పించారు. 
 
కూటమి అధికారంలోకి వస్తే గౌరవమైన పదవిని ఇస్తానని హామీ ఇచ్చారు. కూటమి బంపర్ విక్టరీ కొట్టి అధికారంలోకి వచ్చిన వేళ వర్మకు పదవి ఖాయమనే చర్చ జోరుగా జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై దుండగులు దాడి చేశారు. గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు అద్ధాలు పగులగొట్టారు. 
 
అయితే వర్మపై జనసైనికులే దాడి చేశారని వార్తలు వస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్తలు స్థానిక టీడీపీ నేత అయిన వర్మపై దాడికి యత్నించారు. ఈక్రమంలో ఆయన కారు ధ్వంసం అయింది.

Pithapuram Varma garu about the incident
జనసేన కి పవన్ కళ్యాణ్ గారికి దీనితో ఎటువంటి సంభందం లేదు మేము అయన కలిసికట్టుగా ఉన్నాం pic.twitter.com/rw2wRIXh77

— SKN (Sreenivasa Kumar) (@SKNonline) June 7, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు