ఆలుగడ్డను ఉత్తరాదిలోనే దాచేస్తుండటంతో… కొరత ఏర్పడింది అంటున్నారు వ్యాపారులు. అక్కడి వ్యాపారులు ఆలుగడ్డను అక్రమంగా కోల్డ్‌స్టోరేజీలకు చేరవేమస్తుండటమే కాకుండా.. ధర పెరిగిన తర్వాత మార్కెట్‌కు రిలీజ్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారంటున్నారు.దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో కొరత ఏర్పడి ధరలు భారీగా పెరుగుతున్నాయి.
ఆలుగడ్డ అత్యధికంగా ఉత్పత్తి అయ్యేది ఉత్తరాది రాష్ర్టాల్లోనే. ఢిల్లీలోని ఆగ్రా, మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ర్టాల్లో అత్యధికంగా ఆలు ఉత్పత్తవుతుంది. ఇక తెలంగాణలోని జహీరాబాద్ ఆలుగడ్డకు పెట్టింది పేరు. ఈసారి ఉత్తరాది రాష్ర్టాల్లో ఆలుగడ్డ ఉత్పత్తి భారీగా పెరిగింది.