భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రే తిరుపతికి చేరుకున్న ఆయన, శనివారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహాద్వారం వద్ద ఇఫ్తికపాల్ ఆలయ మర్యాదలతో కోవింద్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కాగా, రంగనాయక మంటపం వద్ద రాష్ట్రపతికి వేదపండితులు ఆశీర్వచనాలు చేశారు.
ఇక రాష్ట్రపతి వెంట గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, మంత్రి అమర్నాథ్ రెడ్డిలు కూడా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలికి రాష్ట్రపతి దంపతులకు తీర్థప్రసాదాలు, శ్రీవారి శేషవస్త్రాన్ని అందజేశారు.