టాలీవుడ్ నిర్మాతలు సి. కల్యాణ్, నట్టికుమార్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎపిసోడ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో.. టాలీవుడ్‌ను కూడా కుదిపేస్తుంది. నయీంతో టాలీవుడ్ ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్లు నిర్మాత నట్టికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే నట్టి కుమార్ వ్యాఖ్యలపై మరో నిర్మాత సి. కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
దొంగతనాలు చేస్తూనే కల్యాణ్ పైకెదిగాడని ఆరోపించారు. భార్యను చంపిన కేసు ఎవరి మీద ఉందనేది తనకేంటి అందరికీ బాగా తెలుసునని, ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్లతో కల్యాణ్‌కు సంబంధాలున్నట్లు కూడా నట్టికుమార్ సెన్సేషనల్ వ్యాఖ్యాలు చేశారు.