తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి వర్షాలు పడే అవకాశం

శనివారం, 8 ఆగస్టు 2020 (17:06 IST)
వాయువ్యం బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో 3.6 కి.మీ నుండి 5.8 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వలన ఉత్తర బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో రేపు(ఆగస్టు 9 వ తేదీన) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
 
అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు కొన్నిచోట్ల మరియు రేపు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు