2 గంటల్లో 8 సెంటీమీటర్లు.. ఎక్కడ?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రికార్డు స్థాయిలో కుండపోత వర్షం కురింసింది. రెండు గంటల వ్యవధిలో ఏకంగా 8 సెంటీమీటర్ల మేరకు వర్షం కురిసింది. ఈ అకాల వర్షం కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా, రామచంద్రాపురంలో 7.98, గచ్చిబౌలిలో 7.75, గాజులరామారంలో 6.5, కుత్బుల్లాపూర్‌లో 5.55, జీడిమెట్లలో 5.33 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.