దక్షిణ జార్ఖండ్ నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఇంటీరియర్ ఒరిస్సా, దక్షిణ ఛత్తీస్ ఘడ్, తెలంగాణ, రాయలసీమ మరియు ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కీమీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
కోస్తా ఆంధ్ర మరియు యానాంలలో ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలలో ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 కీమీ) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.