వైసిపి ఎమ్మెల్యే రోజా జన్మదిన వేడుకలు పుత్తూరులో జరిగాయి. తన జన్మదిన వేడుకలను జరుపుకోవడానికన్నా ముందే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించారు రోజా. పుత్తూరు, నగరి నియోజకవర్గాల్లోని నిరుద్యోగులకు 40 ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలిచ్చేందేకు జాబ్ మేళా నిర్వహించారు. అధిక సంఖ్యలో నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకున్నారు.
నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని గాలికొదిలేశారని రోజా మండిపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా, కొత్త పరిశ్రమలను ఎపికి తీసుకురాలేకుండా చేతకాని ముఖ్యమంత్రిలా చంద్రబాబునాయుడు మారిపోయారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బాబుకు సరైన బుద్థి చెబుతారని అన్నారు రోజా. ఇదిలావుంటే రోజా ప్రారంభించిన జాబ్ మేళాకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలు ఆమెకు కేకులు మీద కేకులు తినిపించారు.