ఆర్ఆర్ఆర్ కస్టడీ నిజాలు.. గుండెల మీద కూర్చుని హార్ట్ ఎటాక్ వచ్చేలా? (video)

సెల్వి

ఆదివారం, 1 డిశెంబరు 2024 (10:10 IST)
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ పెద్దల్ని ఎదిరించి జైలు పాలైన అప్పటి ఎంపీ రఘురామకృష్ణంరాజును కస్టడీలో సీఐడీ అధికారులు చిత్రహింసలకు గురిచేశారు. రఘురామ రాజు కేసులో ఒక కీలక పరిణామం ఆయన గదిలోకి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి ఆయన్ని చావ బాదడం, గుండెల మీద కూర్చుని హార్ట్ ఎటాక్ వచ్చేలా ప్రయత్నించారని తెలిసింది. 
 
గుండెల మీద కూర్చున్న లావుపాటి వ్యక్తి 'గుడివాడకు' చెందిన తులసిగా అనుమానిస్తున్నారు. ఇతను పీవీ సునీల్ కుమార్‌కి సన్నిహితుడిగా చెబుతున్నారు. ఈ చైతన్య అనే వ్యక్తి గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భార్యకు దగ్గర బంధువు అంటున్నారు. 
 
రాము కమ్మ అయినప్పటికీ ఆయన భార్య ఎస్సీ, ఆవిడకి ఈ చైతన్య అనే వాడు బంధువు అనేది తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. మరో వ్యక్తి గౌరీ శంకర్, ఫైబర్ నెట్ కేసులో ఇతనిదే కీలక పాత్రని తెలిసింది. ఈయనకి కేబుల్ టీవీ వ్యాపారం ఉన్నట్టు చెబుతున్నారు.
 
ఈ మొత్తం వ్యవహారం సమన్వయం చేసిన అప్పటి సీఐడీ ఏసీపీ విజయ్ పాల్ తాజాగా అరెస్టు అయి జైలు పాలయ్యారు. దీనిపై ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామరాజు స్పందించారు. 
 
తనను పుట్టినరోజు అరెస్టు చేసి, జైలుకు పంపి, అక్కడా చిత్రహింసలు పెట్టిన విజయ్ పాల్ ఇప్పుడు అలాగే అరెస్టు అయి అదే గుంటూరు జైలుకు వెళ్లారని, కర్మ ఎవరినీ వదిలిపెట్టదని రఘురామ వ్యాఖ్యానించారు.

రఘురామ రాజు కేసులో ఒక కీలక పరిణామం ఆయన గదిలోకి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి ఆయన్ని చావ బాదడం, గుండెల మీద కూర్చుని హార్ట్ ఎటాక్ వచ్చేలా ప్రయత్నించడం.

గుండెల మీద కూర్చున్న లావుపాటి వ్యక్తి 'గుడివాడకు' చెందిన తులసిగా అనుమానిస్తున్నారు. ఇతను పీవీ సునీల్ కుమార్ కి… pic.twitter.com/ffX7uFIwY5

— మన ప్రకాశం (@mana_Prakasam) November 30, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు