తూర్పుగోదావరి జిల్లాలో కోళ్ళు పెద్ద ఎత్తున మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరణానికి కారణం బర్డ్ ఫ్లూ అని అధికారులు నిర్ధారించారు. ముందు జాగ్రత్త చర్యగా, కొన్ని రోజులు ప్రజలు చికెన్ తినడం మానుకోవాలని అధికారులు. కోళ్ల వినియోగాన్ని తగ్గించాలని వారు ప్రజలకు సూచించారు.
ల్యాబ్ రిపోర్ట్ రావడంతో రాజమండ్రి కలెక్టరేట్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కానూరు గ్రామం పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్, పది కిలోమీటర్లు సర్వైలెన్స్ జోన్‌గా ప్రకటించి.. ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. దీనిపై పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేశారు.