జులై 4న ప్రధాని పర్యటన: ఒక్క రోజు లేటుగా పాఠశాలల పునఃప్రారంభం
బుధవారం, 22 జూన్ 2022 (10:52 IST)
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పునఃప్రారంభ తేదీ వాయిదా పడింది. మే 6 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జులై 4న పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉంది. అయితే, జులై 4కు బదులు జులై 5న పాఠశాలలు తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
జులై 4న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన దృష్ట్యా ఒక రోజు వాయిదా వేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. జులై 4న ప్రధానమంత్రి భీమవరంలో పర్యటించనున్నారు.